CPI Narayana: చెడ్డోడో.. మంచోడో గాలి జనార్దన్‌రెడ్డికైనా అప్పగించండి: నారాయణ

కడప ఉక్కు పరిశ్రమను సీఎం జగన్‌ ఏర్పాటు చేయలేకపోతే, చెడ్డోడో.. మంచోడో గాలి జనార్దన్‌రెడ్డికైనా అప్పగిస్తే ఫ్యాక్టరీ కట్టేస్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

Updated : 17 Aug 2022 07:57 IST

రాయచోటి, న్యూస్‌టుడే: కడప ఉక్కు పరిశ్రమను సీఎం జగన్‌ ఏర్పాటు చేయలేకపోతే, చెడ్డోడో.. మంచోడో గాలి జనార్దన్‌రెడ్డికైనా అప్పగిస్తే ఫ్యాక్టరీ కట్టేస్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో మంగళవారం సీపీఐ జిల్లా మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే పదివేల మంది నిరుద్యోగులకైనా  ఉద్యోగ అవకాశాలు వచ్చేవన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేయలేక, మరోవైపు రాష్ట్రాన్ని బాగుచేయక, కనీసం కడపనూ పట్టించుకోలేని పరిస్థితికి వచ్చారని విమర్శించారు. ఇప్పుడంతా హత్యలు, బ్లాక్‌మెయిల్‌, అత్యాచారాలు జరుగుతున్నాయని, బ్లూఫిల్మ్‌లు బయటికి వస్తున్నాయని ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో ఇక్కడొక మాట, దిల్లీలో మరో మాట చెప్పడం ఎందుకన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు ఓబులేసు, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని