రిబ్బన్‌ కటింగ్‌ తప్ప.. మీరు తెచ్చిన పరిశ్రమలేవి?

గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన కంపెనీలకు ముఖ్యమంత్రి జగన్‌ రిబ్బన్‌ కట్‌ చేసి, అది ఆయన ఘనతగా చెబుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ‘‘కియా మోటార్స్‌, హీరో మోటార్స్‌, అశోక్‌ లేలాండ్‌,

Published : 17 Aug 2022 03:51 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శ

ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన కంపెనీలకు ముఖ్యమంత్రి జగన్‌ రిబ్బన్‌ కట్‌ చేసి, అది ఆయన ఘనతగా చెబుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ‘‘కియా మోటార్స్‌, హీరో మోటార్స్‌, అశోక్‌ లేలాండ్‌, ఇసుజు, అపోలో టైర్స్‌, టీసీఎల్‌, యొకొహామా... ఇలా గత ప్రభుత్వం తెచ్చిన కంపెనీలన్నింటికీ రిబ్బన్‌ కటింగ్‌ చేయడం తప్ప జగన్‌రెడ్డి ప్రభుత్వం తెచ్చిన కంపెనీ ఒక్కటైనా ఉందా?’’ అని ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు.

లీగల్‌సెల్‌లో మరో ఇద్దరికి చోటు

తెదేపా లీగల్‌సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గానికి చెందిన శ్రీహరి నారాయణ, నెల్లూరు నగరానికి చెందిన    చెన్నమనేని మురళిలను నియమించినట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని