మునుగోడు అభివృద్ధి తెరాసతోనే సాధ్యం: మంత్రి జగదీశ్‌రెడ్డి
మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు తమ పార్టీకే పట్టం కడతారని రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తెరాస ఎమ్మెల్యేలతో ప్రగతిలో పోటీ పడలేకే రాజగోపాల్‌రెడ్డి పదవిని వదులుకున్నారని పేర్కొన్నారు. మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అర్హత
తెరాసలోకి మరో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు
ఈనాడు, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు తమ పార్టీకే పట్టం కడతారని రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తెరాస ఎమ్మెల్యేలతో ప్రగతిలో పోటీ పడలేకే రాజగోపాల్‌రెడ్డి పదవిని వదులుకున్నారని పేర్కొన్నారు. మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అర్హత ఆయనకు లేదని తెలిపారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని మంత్రి జగదీశ్‌రెడ్డి నివాసంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన పెద్దాపురం, దేవత్‌పల్లి కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు రాధికాశ్రీనివాస్, సుజాతశంకర్లు తెరాసలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, శాసనసభ్యుడు గాదరి కిశోర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ‘‘విపక్ష పార్టీల నిజస్వరూపాలు తెలిసి పలువురు ప్రజాప్రతినిధులు తెరాసలో చేరుతున్నారు. ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ ఎంపీటీసీలు, 20 మందికిపైగా సర్పంచులు గులాబీ కండువాలు కప్పుకున్నారు. వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పార్టీ, నియోజకవర్గ అభివృద్ధికి వారి సేవలు ఉపయోగించుకుంటాం’’ అని మంత్రి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు