‘దేశం ఆలోచనాధోరణి మారింది’ ప్రచారానికి భాజపా శ్రీకారం

‘దేశం ఆలోచనాధోరణి మారింది (దేశ్‌ కీ బద్లీ సోచ్‌)’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక ప్రచారాన్ని భాజపా తాజాగా ప్రారంభించింది. ఇందులో భాగంగా- ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ చేసిన

Published : 17 Aug 2022 05:59 IST

దిల్లీ: ‘దేశం ఆలోచనాధోరణి మారింది (దేశ్‌ కీ బద్లీ సోచ్‌)’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక ప్రచారాన్ని భాజపా తాజాగా ప్రారంభించింది. ఇందులో భాగంగా- ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలను.. గతంలో కాంగ్రెస్‌ నుంచి ప్రధాని పీఠమెక్కిన మన్మోహన్‌ సింగ్‌, రాజీవ్‌ గాంధీ, ఇందిరా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ వంటి నేతల పంద్రాగస్టు ప్రసంగాలతో పోల్చిచూపింది. చైనాతో 1962 నాటి యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు 1963 నాటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో నెహ్రూ నివాళులర్పించలేదని.. మోదీ మాత్రం లద్దాఖ్‌లో చైనా బలగాలతో పోరులో అమరులైన సైనికుల త్యాగాలను 2020 నాటి ప్రసంగంలో గుర్తుచేసుకున్నారని ఓ గ్రాఫిక్‌లో కమలదళం పేర్కొంది. 2008, 2009ల్లో మన్మోహన్‌ ఓ కుటుంబానికి చెందిన నేతల సేవలనే స్మరించుకున్నారని.. ‘ప్రధానులందరి కృషితోనే దేశం ఈ స్థాయికి చేరుకుంది’ అని 2014లో మోదీ వ్యాఖ్యానించారని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు