Updated : 18 Aug 2022 07:10 IST

Pawan Kalyan: ఎమ్మెల్యేలు, ఎంపీలనూ ట్రాక్‌ చేస్తాం: పవన్‌కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: ‘ఉపాధ్యాయులు జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఒక యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని వైకాపా ప్రభుత్వం చెబుతోంది. పాఠశాలకు రాగానే అందులో హాజరు నమోదు చేయాలని ఉపాధ్యాయులను ఒత్తిడి చేస్తోంది. అదే తరహాలో పౌరులు కూడా ఒక యాప్‌ సిద్ధం చేస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారో ట్రాక్‌ చేసేలా అది ఉంటుంది. బాధ్యత ఎప్పుడూ ఒకరికే ఉండకూడదు. అందరికీ అది ఉండాలి’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. దీనికి ఒక కార్టూన్‌ కూడా జోడించారు. ఉపాధ్యాయులంతా యాప్‌ సిగ్నల్‌ కోసం అటూ ఇటూ తిరుగుతున్నట్లుగా ఆ కార్టూన్‌లో ఉంటుంది. అందులో స్కూలు అటెండర్‌ మాట్లాడుతూ ‘పాపం రాగానే పిల్లలకు పాఠాలు చెప్పేవాళ్లు. అదేదో యాపట... దాని సిగ్నల్‌ కోసం చెట్టుకొకరు, పుట్టకొకరు అట్టా తిరుగుతున్నారు సార్‌’ అని వేరే ఎవరికో చెబుతున్నట్లు ఉంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని