ఎంపీ మాధవ్‌పై చర్య తీసుకోకపోవడం సిగ్గుచేటు: ఎమ్మెల్సీ రామారావు

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ అశ్లీల వీడియో అసలైందేనని అమెరికాలోని ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ధ్రువీకరించినా.. ముఖ్యమంత్రి ఆయనపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని

Published : 18 Aug 2022 05:19 IST

ఈనాడు, అమరావతి: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ అశ్లీల వీడియో అసలైందేనని అమెరికాలోని ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ధ్రువీకరించినా.. ముఖ్యమంత్రి ఆయనపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని తెదేపా ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ధ్వజమెత్తారు. ‘గోరంట్ల మాధవ్‌ను వైకాపా నుంచి ఎందుకు బహిష్కరించలేదు. ఆయన ఏం సాధించాడని హిందూపురానికి ర్యాలీగా వచ్చారు? చేసిన పాడుపనికి సిగ్గుపడకపోగా బరితెగించి రోడ్డెక్కడమేంటి? విజయవాడలో అత్యాచార బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు వెళ్లిన చంద్రబాబుకు ఏకంగా నోటీసు ఇచ్చిన మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ.. మాధవ్‌ వ్యవహారంపై ఎందుకు నోరు మెదపటం లేదు?’ అని రామారావు విలేఖరుల సమావేశంలో ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని