Published : 18 Aug 2022 05:19 IST

విదేశీ విద్యపై తెదేపాది దుష్ప్రచారం: మంత్రి నాగార్జున

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్‌ పేరును తొలగించారంటూ తెదేపా దుష్ప్రచారం చేస్తోందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. తెదేపా హయాంలో అమలైన అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యా నిధి, ప్రస్తుతం అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాలు ఒకటి కాదన్నారు. అప్పట్లో అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యా నిధి పథకాన్ని కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే అమలు చేశారని, అదే జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికీ అమలు చేస్తున్నామని బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సీఎం జగన్‌ తీసుకొస్తున్న జనరంజక పథకాలను అభాసుపాలు చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్‌ పేరు తొలగించారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని