ఉపాధ్యాయులను వదిలించుకునే కుట్ర ఇది

‘‘పాఠశాల విద్యను పేదలకు దూరం చేసే కుట్రకు వైకాపా ప్రభుత్వం తెరతీసింది. ఉపాధ్యాయులను వదిలించుకుని ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ఆలోచన చేస్తోంది. దీనికి సంస్కరణలు, సాంకేతికత వినియోగం వంటి

Published : 18 Aug 2022 05:19 IST

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌

ఈనాడు, అమరావతి: ‘‘పాఠశాల విద్యను పేదలకు దూరం చేసే కుట్రకు వైకాపా ప్రభుత్వం తెరతీసింది. ఉపాధ్యాయులను వదిలించుకుని ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ఆలోచన చేస్తోంది. దీనికి సంస్కరణలు, సాంకేతికత వినియోగం వంటి ముసుగు వేస్తోంది’’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఇందులో భాగంగానే ఉపాధ్యాయులను వేధించడం, బోధనతో సంబంధం లేని పనులు అప్పగించడం, మరుగుదొడ్ల ఫొటోలు తీయించడం, మద్యం దుకాణాల వద్ద డ్యూటీలు, కోడిగుడ్ల లెక్కలు వంటి పనులు చెబుతూ పాఠాలు చెప్పించే సమయం తగ్గిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు హాజరుకు సంబంధించి ఫేస్‌ రికగ్నేషన్‌ యాప్‌ అని గందరగోళపరుస్తున్నారని అన్నారు. గడప దాటి సచివాలయానికి వెళ్లని సీఎం కూడా నిమిషం ఆలస్యమైతే ఆబ్సెంట్‌ అంటూ ఉత్తర్వులు ఇప్పించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీపీఎస్‌ రద్దు, జీతభత్యాలు, ఎన్నికల హామీలపై ప్రభుత్వాన్ని వారు ప్రశ్నిస్తున్నందునే ఇలా వేధిస్తున్నారని విమర్శించారు. మరోవైపు వైయస్‌ఆర్‌ జిల్లాలోని సిద్ధవటంలో జనసేన నాయకులతో గురువారం నాదెండ్ల మనోహర్‌ సమావేశం నిర్వహిస్తారు. ఈ నెల 20న పవన్‌కల్యాణ్‌ అక్కడ కౌలు రైతు భరోసా యాత్రలో పాల్గొని ప్రసంగిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని