వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: శైలజానాథ్‌

వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏపీపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ఆరోపించారు. వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తూతూమంత్రంగా

Published : 18 Aug 2022 05:19 IST

ఈనాడు, అమరావతి: వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏపీపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ఆరోపించారు. వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తూతూమంత్రంగా పర్యటించి చేతులు దులిపేసుకున్నారని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ‘గోదావరి వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ రోజుల వ్యవధిలోనే పెరుగుతుండటంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వేలాది మంది కంటి మీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. 30 గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద వరద 35 అడుగులకు చేరుకోగానే మండలంలోని యడవల్లి-బోళ్లపల్లి గ్రామాల మధ్యలోని ఎద్దువాగు వంతెన నీట మునిగి ఆవలి వైపున ఉన్న 17 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని