సొంత పార్టీలోనే వెన్నుపోటుదారులు

‘సొంత పార్టీలోని సాటి ఎమ్మెల్యేలే వెన్నుపోటు పొడుస్తున్నారు.. నగర నియోజకవర్గంలో నన్ను బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తున్నారు.. కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులకు డబ్బులిచ్చి నాపై అసత్య

Updated : 19 Aug 2022 05:01 IST

మాజీ మంత్రి అనిల్‌ తీవ్ర విమర్శలు

నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: ‘సొంత పార్టీలోని సాటి ఎమ్మెల్యేలే వెన్నుపోటు పొడుస్తున్నారు.. నగర నియోజకవర్గంలో నన్ను బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తున్నారు.. కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులకు డబ్బులిచ్చి నాపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారు’ అంటూ మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం నగరంలోని 52వ డివిజన్‌లో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘డబ్బులిచ్చి నన్ను తిట్టించే స్థాయికి దిగజారారు. వైకాపాలో ఉండి ఓ నేత సిగ్గుమాలిన పని చేస్తున్నారు. మా ఎమ్మెల్యేలు, నాయకులతో మంతనాలు సాగిస్తూ తెదేపా నాయకుల్లో ఒకరు రోజుకు రూ.10 వేలు, ఇంకొకరు రూ.లక్ష చొప్పున సంపాదిస్తున్నారు. ఈ రెండు బ్యాచ్‌ల చరిత్ర అంతా నా దగ్గర ఉంది. అన్నింటిని ఓపిక పట్టి చూస్తున్నా’ అని చెప్పారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని