ఆర్థిక సుస్థిరత రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతే

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ చట్టం 2005 ప్రకారం రెవెన్యూ లోటును పూర్తిగా పరిహరించి, ఆర్థిక లోటును తగ్గించుకుంటూ ఆర్థిక సుస్థిరత సాధించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌

Published : 19 Aug 2022 04:26 IST

కేంద్ర ఆర్థిక శాఖ  సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి
ఎంపీ రఘురామకృష్ణరాజుకు లేఖ

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ చట్టం 2005 ప్రకారం రెవెన్యూ లోటును పూర్తిగా పరిహరించి, ఆర్థిక లోటును తగ్గించుకుంటూ ఆర్థిక సుస్థిరత సాధించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం ఆదాయాన్ని దారి మళ్లిస్తోందంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు జులై 21న లోక్‌సభలో ప్రసంగించారు. దీనికి కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి లేఖ రూపంలో సమాధానమిచ్చారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3) కింద రాష్ట్ర ప్రభుత్వాలు చేసే రుణాలకు కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయవిభాగం సాధారణంగా అనుమతులు ఇస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌, అలాంటి ఇతర వ్యవస్థల ద్వారా రుణాలు తీసుకొని దానికి సంబంధించిన అసలు, వడ్డీని రాష్ట్ర బడ్జెట్ల నుంచి చెల్లిస్తున్నట్లు ఆర్థికశాఖ దృష్టికి వచ్చింది. అందుకే ఇలాంటి అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలుగానే పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వం గత మార్చిలోనే రాష్ట్రాలకు వర్తమానంపంపింది’ అని పేర్కొన్నారు.

గోదావరి నీళ్ల కన్నా రాష్ట్రంలో నిధుల వృథానే ఎక్కువ: గోదావరి నీళ్ల కంటే రాష్ట్రంలో నిధులే ఎక్కువగా వృథా అవుతున్నాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. డబ్బు వృథాపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి, తమ పార్టీ జాతీయ కార్యదర్శి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలవరం పనులకు పోలియో వచ్చిందని.. గత ప్రభుత్వం 75% పనులు చేస్తే తమ ప్రభుత్వం 3% పనులే చేసిందని ఆయన విమర్శించారు. పోలవరం పూర్తి చేయకపోతే ఉభయగోదావరి జిల్లాల్లో ఎన్ని కబుర్లు చెప్పినా తమ పార్టీకి 20 నుంచి 25 శాతానికి మించి ఓట్లు రావన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని