Updated : 19 Aug 2022 06:19 IST

ఇంటికో డాక్టర్‌ అంటూ జగన్‌ ఎవరిని మోసం చేస్తున్నారు?

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో వైద్యుల సంఖ్య పెరగలేదని.. కానీ జగన్‌ ఇంటికో డాక్టర్‌ అంటూ ఎవరిని మోసం చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. 2016లో తెదేపా ప్రారంభించిన మొబైల్‌ క్లినిక్‌లకు పేరు మార్చి ఫ్యామిలీ డాక్టర్‌, ఇంటికో డాక్టర్‌ అంటూ జగన్‌ ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని గురువారం ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ కొత్తగా వైద్య ఉద్యోగాలు ఇచ్చి డాక్టర్‌, పేషంట్‌ నిష్పత్తిని తగ్గించారా? గ్రామాల్లో ఇప్పటికీ వైద్యులు అందుబాటులో ఉండనిది నిజం కాదా? పట్టణాల్లో వైద్య సిబ్బంది విధులకు ఆలస్యంగా వస్తున్న పరిస్థితి లేదా? కొత్తగా ఒక్క ఆసుపత్రినైనా నిర్మించారా? కొత్త వైద్య పరికరాలు సమకూర్చారా? సిబ్బంది సంఖ్యను పెంచారా? సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉండడంతో వారిపై ఒత్తిడి పెరుగుతున్న మాటా వాస్తవం కాదా?...’’ అని పేర్కొన్నారు. సదుపాయాలు, సిబ్బంది, ప్రమాణాలు మెరుగుపరచాలని, కనీసం ఆసుపత్రులకు వచ్చే రోగులకైనా ఉత్తమ సేవలు అందించాలని అచ్చెన్నాయుడు సూచించారు. రాష్ట్రంలో వైద్య పరిస్థితిపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను ట్వీట్‌కు జత చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని