ఎనర్జీ అసిస్టెంట్లను కట్టుబానిసల్లా వాడుకుంటున్నారు

 గ్రామ, పట్టణ సచివాలయాల్లో పని చేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లను జగన్‌ సర్కారు కట్టుబానిసల్లా వాడుకొంటుందని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఎలాంటి శిక్షణ లేకుండా వీరిని ప్రమాదకరమైన విద్యుత్తు

Updated : 19 Aug 2022 06:18 IST

సీఎం జగన్‌కు నారా లోకేశ్‌ లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి:  గ్రామ, పట్టణ సచివాలయాల్లో పని చేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లను జగన్‌ సర్కారు కట్టుబానిసల్లా వాడుకొంటుందని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఎలాంటి శిక్షణ లేకుండా వీరిని ప్రమాదకరమైన విద్యుత్తు లైన్ల మరమ్మతులకు స్తంభాలు ఎక్కించడంతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎనర్జీ అసిస్టెంట్ల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సీఎం జగన్‌కు గురువారం ఆయన లేఖ రాశారు. ‘‘సెలవులు లేకుండా ఎనర్జీ అసిస్టెంట్లు 24 గంటలు పనిచేయాల్సి వస్తోంది. వారు తీవ్రమైన మానసిక ఒత్తికి గురవుతున్నారు. పేరుకు సచివాలయ ఉద్యోగులుగా ఉన్నా.. వీరితో విద్యుత్తు శాఖ చాకిరీ చేయించుకుంటోంది. ప్రమాదకరమైన పనులు చేస్తూ ఇప్పటివరకు 89 మంది ఎనర్జీ అసిస్టెంట్లు మరణించారు. రెండు వందల మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి పరిహారం చెల్లించడంలో అన్యాయం జరుగుతోంది. సచివాలయ ఉద్యోగి అంటూ విద్యుత్తు శాఖ తప్పించుకుంటోంది. ఎనర్జీ అసిస్టెంట్ల అభిప్రాయాలు తీసుకోకుండా కొత్త నిబంధనలు, డ్యూటీ ఛార్టులు రూపొందించడం వారి హక్కులను హరించడమే. సచివాలయాల్లో పనిచేస్తున్న వీరికి మాత్రమే ప్రొబెషన్‌ ప్రకటించకపోవడం దారుణం.   ప్రభుత్వం స్పందించి  విద్యుత్తు శాఖలోకి తీసుకోవాలి’’ అని నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని