రోహింగ్యాలపై రాజకీయ దుమారం

రోహింగ్యాలను దిల్లీలో ‘ఆర్థికంగా వెనుకబడిన తరగతుల’ వారి (ఈడబ్ల్యూఎస్‌) ఫ్లాట్లకు తరలించే అంశంపై మొదలైన వివాదం రాజకీయ దుమారానికి కారణమైంది. దీనిపై వివిధ పక్షాలు

Published : 19 Aug 2022 05:15 IST

దిల్లీ: రోహింగ్యాలను దిల్లీలో ‘ఆర్థికంగా వెనుకబడిన తరగతుల’ వారి (ఈడబ్ల్యూఎస్‌) ఫ్లాట్లకు తరలించే అంశంపై మొదలైన వివాదం రాజకీయ దుమారానికి కారణమైంది. దీనిపై వివిధ పక్షాలు తమతమ వాదనలతో వాతావరణాన్ని వేడెక్కించాయి. రోహింగ్యాలు ఉండే మదన్‌పుర్‌ ఖదర్‌ ప్రాంతంలో 2021 జూన్‌లో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు మొదలైనట్లు అధికారిక పత్రాలు వెల్లడిస్తున్నాయి. రోహింగ్యాలకు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఉచిత పథకాలు అందిస్తున్నారని, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం దేశభద్రత విషయంలో రాజీ పడుతున్నారని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ ఆరోపించారు. భాజపా మాత్రం దేశ భద్రతకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. రోహింగ్యాలకు భారత పౌరసత్వం ఇచ్చేది లేదని కేంద్ర హోంశాఖ స్పష్టంగా చెప్పిందని, వాళ్లను వెనక్కి పంపుతామని తెలిపారు. రోహింగ్యాలను ఫ్లాట్లలోకి తరలించాలన్న నిర్ణయం ఎవరు తీసుకున్నారో తేల్చేందుకు నిష్పాక్షిక విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా లేఖ రాశారు. రోహింగ్యాలు అక్రమంగా ఉండటం వల్ల రాజధానితో పాటు దేశ భద్రతకూ ప్రమాదమన్నదే తమ ప్రభుత్వం చెబుతోందన్నారు. ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్‌గా వ్యవహరించిన దేశంలో ఇప్పుడు రోహింగ్యాల విషయంలో గందరగోళం నెలకొనడం ప్రభుత్వానికే అవమానమని కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్‌ మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని