రేపిస్టులకు మద్దతు సిగ్గుచేటు :రాహుల్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌, హాథరస్‌లలో.. జమ్మూకశ్మీర్‌లోని కథువాలో.. ఇపుడేమో గుజరాత్‌లో అత్యాచార కేసుల్లో నేరగాళ్లకు మద్దతు పలకడం భాజపాకు సిగ్గుచేటని కాంగ్రెస్‌ అగ్రనేత

Published : 19 Aug 2022 05:15 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌, హాథరస్‌లలో.. జమ్మూకశ్మీర్‌లోని కథువాలో.. ఇపుడేమో గుజరాత్‌లో అత్యాచార కేసుల్లో నేరగాళ్లకు మద్దతు పలకడం భాజపాకు సిగ్గుచేటని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ గురువారం ట్వీట్‌ చేశారు. బిల్కిస్‌ బానో కేసు నిందితులను విడుదల చేయాలని గుజరాత్‌ సర్కారుకు సిఫార్సు చేసిన ప్యానెల్‌లో ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు ఉండటం మరో విశేషమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం ట్వీట్‌ చేశారు.

మహిళల స్థయిర్యాన్ని దెబ్బతీయకండి : బిల్కిస్‌ బానో

గోధ్రా అల్లర్లలో తనపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన  దోషులను గుజరాత్‌ సర్కారు విడుదల చేయడంపై బిల్కిస్‌ బానో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్య కోర్టుల్లో న్యాయం కోసం పోరాడుతున్న మహిళల స్థయిర్యాన్ని దెబ్బ తీస్తుందంటూ తన న్యాయవాది ద్వారా ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని