ఆ విషయంపై మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానం చెప్పాలి: మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి మునుగోడు నియోజకవర్గంలో తెరాస చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి తనకు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు ఎవరూ సమాచారం ఇవ్వడం లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ

Updated : 05 Sep 2022 06:57 IST

మునుగోడు, న్యూస్‌టుడే: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి మునుగోడు నియోజకవర్గంలో తెరాస చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి తనకు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు ఎవరూ సమాచారం ఇవ్వడం లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ పేర్కొన్నారు. ఆదివారం మునుగోడులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని కోరారు.  బీసీ సామాజికవర్గం బలంగా ఉన్న మునుగోడులో ఆ వర్గం నేతలను కలుపుకొని పోవాల్సి ఉండగా.. ఇలా వ్యవహరించడమేంటని ప్రశ్నించారు. అభ్యర్థి ఎవరైనా తెరాసదే విజయమని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఇతర పార్టీల్లా తెరాసలో లాబీయింగ్‌కు తావుండదని.. అంతిమ నిర్ణయం కేసీఆర్‌దేనని, ఆయన చెప్పిన విధంగా పనిచేస్తామని స్పష్టంచేశారు. బీసీ సామాజికవర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో టికెట్‌ ఆశించడంలో తప్పేముందని ప్రశ్నించారు. పదవులు ఉన్నా.. లేకున్నా.. ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని