Andhra News: చెత్త పన్ను చెల్లించకపోతే పథకాలు నిలిపేస్తారా?

పేదలకు పెనుభారంగా మారిన చెత్త పన్ను చెల్లించకపోతే... ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపేస్తారా..అని పలువురు మహిళలు ప్రశ్నించారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం పశ్చిమ

Updated : 09 Sep 2022 09:27 IST

వైకాపా ఇన్‌ఛార్జి ఆనంద్‌కుమార్‌ను నిలదీసిన మహిళలు

విశాఖపట్నం (మల్కాపురం), న్యూస్‌టుడే: పేదలకు పెనుభారంగా మారిన చెత్త పన్ను చెల్లించకపోతే... ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపేస్తారా..అని పలువురు మహిళలు ప్రశ్నించారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం వైకాపా ఇన్‌ఛార్జి ఆడారి ఆనంద్‌కుమార్‌ గురువారం జీవీఎంసీ 62వ వార్డు త్రినాథపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఆయనను నిలదీశారు. ప్రతి నెలా చెత్త పన్ను చెల్లించకపోతే... ఆరు నెలలకు ఓసారి ఇంటి పన్నుతో కలిపి చెల్లించాలంటూ సచివాలయ సిబ్బంది బెదిరిస్తున్నారని, అర్హులైన వారికి పథకాల్లో చోటు కల్పించడం లేదని పెద్ద ఎత్తున మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో స్థానిక మహిళలకు, వైకాపా శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలో ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు ప్రయత్నించిన మల్కాపురం జోన్‌ సీపీఎం నాయకుడు పి.పైడిరాజుని పోలీసులు అడ్డుకున్నారు. మల్కాపురం సీఐ లూథర్‌బాబు వారిని వారించే ప్రయత్నం చేస్తుండగా ఎలాంటి సమాధానాలు చెప్పకుండానే ఆనంద్‌కుమార్‌ మరో వీధిలోకి వెళ్లిపోయి.. అక్కడ నుంచి కార్యక్రమాన్ని కొనసాగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని