ముస్లిముల పట్ల భాజపా వైఖరి ఇప్పుడైనా మారుతుందా?

ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌  మసీదు, మదర్సాలను సందర్శించారు. అక్కడి ఇమామ్‌లు ఆయన్ను జాతిపితగా అభివర్ణించారు. మరి ఇప్పుడైనా ముస్లిములు, వారి ప్రార్థనా స్థలాల పట్ల భాజపా, ఆ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాల ప్రతికూల వైఖరిలో

Published : 24 Sep 2022 05:29 IST

- మాయావతి

రెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌  మసీదు, మదర్సాలను సందర్శించారు. అక్కడి ఇమామ్‌లు ఆయన్ను జాతిపితగా అభివర్ణించారు. మరి ఇప్పుడైనా ముస్లిములు, వారి ప్రార్థనా స్థలాల పట్ల భాజపా, ఆ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాల ప్రతికూల వైఖరిలో మార్పు వస్తుందా? ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కారు ప్రభుత్వ మదర్సాలను విస్మరించడంతోపాటు ప్రైవేటు మదర్సాల కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటోంది. 


           రామరాజ్యం చాలా ఖరీదైన వ్యవహారం

- మహువా మొయిత్రా

ఏడాది జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా ఏకంగా రూ.340 కోట్లు ఖర్చు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోనే రూ.221 కోట్లు వ్యయం చేసింది. ఇవి ఆ పార్టీ అధికారికంగా ప్రకటించిన లెక్కలు మాత్రమే. అప్రకటిత వ్యయం అంతకన్నా చాలా ఎక్కువగానే ఉంటుంది. రామరాజ్యం చాలా ఖరీదైన వ్యవహారమని స్పష్టంగా అర్థమైంది.          


రూపాయి క్షీణతపై మోదీ ఏమంటారు?
- ప్రియాంకా గాంధీ

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పతనమై రూ.81కి చేరింది. 2014 ముందు వరకు రూపాయి విలువ పడిపోవడాన్ని దేశ పరపతికి, ప్రభుత్వ విధానాలకు ముడిపెట్టిన ప్రధాని మోదీ ఇప్పుడు మౌనంగా ఉన్నారు. రూపాయి ప్రస్తుత క్షీణత కూడా భాజపా ప్రభుత్వ అవినీతి విధానాల ఫలితమేనా?        

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు