మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో కుమారుడు

మహారాష్ట్రలో మరో రాజకీయ దుమారం రేగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కుమారుడు, లోక్‌సభ సభ్యుడు శ్రీకాంత్‌ శిందే సీఎం కుర్చీలో కూర్చోవడం తాజా వివాదానికి కారణమైంది.

Published : 24 Sep 2022 05:29 IST

ముంబయి: మహారాష్ట్రలో మరో రాజకీయ దుమారం రేగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కుమారుడు, లోక్‌సభ సభ్యుడు శ్రీకాంత్‌ శిందే సీఎం కుర్చీలో కూర్చోవడం తాజా వివాదానికి కారణమైంది. దీనికి సంబంధించిన ఫొటో బయటకు రావడంతో విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ‘సూపర్‌ సీఎం’ అంటూ ఎన్సీపీ ఎద్దేవా చేసింది. చిత్రంలో ముఖ్యమంత్రి పీఠంపై శ్రీకాంత్‌ శిందే కూర్చొని ఉండగా.. చుట్టూ అధికారులు ఉన్నారు. కుర్చీ వెనుక ‘మహారాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యమంత్రి’ అని బోర్డు ఉంది. శ్రీకాంత్‌ ఏవో దస్తాల్రు పరిశీలిస్తున్నట్లు అందులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని