సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా కొల్లు అంకబాబు అరెస్టు

సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా సీనియర్‌ పాత్రికేయుడు కొల్లు అంకబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. జగన్‌

Published : 24 Sep 2022 05:52 IST

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా సీనియర్‌ పాత్రికేయుడు కొల్లు అంకబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వంలో ఎంత మందిపై పీడీ యాక్టులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్‌ ప్రభుత్వం పాత్రికేయులను కూడా వదలడం లేదు. గన్నవరం విమానాశ్రయంలో.. ఏపీ సీఎంవోలో పనిచేస్తున్న ఓ కీలక అధికారి భార్య వద్ద బంగారం పట్టుబడిన వార్తను సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్‌ చేశారని దౌర్జన్యంగా అరెస్టు చేశారు. 73 ఏళ్ల వృద్ధుడని కూడా చూడలేదు. నిజాన్ని పోస్టు చేస్తే అరెస్టులు చేస్తారా? జగన్‌ను ఎవరూ ప్రశ్నించకూడదా? ఏ వ్యక్తినైనా అరెస్టు చేయాలంటే ముందుగా 41ఏ నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు పదేపదే చెబుతోంది. కానీ ఏపీ సీఐడీ అధికారులు దీన్ని పెడచెవినపెడుతున్నారు’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని