ఆరోగ్య వర్సిటీ పేరు మార్చడం అన్యాయం

ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం అన్యాయమని రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్‌ అన్నారు. ఈ నిర్ణయం మార్చుకోవాలని, సీఎం సొంత చెల్లే దీన్ని

Published : 24 Sep 2022 05:52 IST

రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్‌

విశాఖపట్నం (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం అన్యాయమని రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్‌ అన్నారు. ఈ నిర్ణయం మార్చుకోవాలని, సీఎం సొంత చెల్లే దీన్ని వ్యతిరేకించారని తెలిపారు. విశాఖలోని భాజపా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి రైతుల యాత్రకు భాజపా అండగా ఉంటుందని చెప్పారు. ఉత్తరాంధ్రలో వారి యాత్రకు రక్షణ కవచంలా ఉంటుందని తెలిపారు. మూడు రాజధానులపై కేంద్రానికి చెప్పే చేస్తున్నామని నెపం వేస్తున్నారని, అమరావతి రైతులపై దాడిచేస్తే భాజపాపై దాడి చేసినట్లుగా భావిస్తామని పేర్కొన్నారు. ప్రధాని పునాదులు వేసిన రాజధానిని అడ్డుకున్నారని, దాన్ని భాజపా ఎలా అంగీకరిస్తుందని ప్రశ్నించారు. ‘నా రాజ్యంలో ఎవరైనా ఎదురు తిరిగితే ఖతం చేస్తానన్న’ ధోరణిలో సీఎం జగన్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘‘ఉత్తరాంధ్రలో ప్రశాంతమైన వాతావరణాన్ని దెబ్బతీశారు. ఇటీవల విశాఖలో 15 హత్యలు జరిగాయి. ఏపీలో గుట్కాలు నిషేధించి ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. దీని వెనక వైకాపా నాయకుల హస్తం ఉంది. స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల జీతాలు, జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచే విధంగా కేంద్రం ఆలోచిస్తోంది’’ అని సి.ఎం.రమేష్‌ వివరించారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ జగన్‌మోహన్‌ రెడ్డి వైకాపాకు శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకొని వెనక్కి తగ్గారని చెప్పారు. ఎన్నికల సంఘం ఆయన ఆశలపై నీళ్లు చల్లడంతో సజ్జల సర్దిచెప్పేలా మాట్లాడారని అన్నారు. ఎమ్మెల్సీ మాధవ్‌, నేతలు ఎం.రవీంద్ర, సురేంద్రమోహన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని