జగన్‌ కుప్పం పర్యటనలో బైండోవర్లు, గృహనిర్బంధాలు

సీఎం జగన్‌ వేల మంది పోలీసుల పహారా మధ్య  కుప్పంలో పర్యటించడం నవ్వు తెప్పిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ‘‘కుప్పం పర్యటన

Published : 24 Sep 2022 05:52 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌ వేల మంది పోలీసుల పహారా మధ్య  కుప్పంలో పర్యటించడం నవ్వు తెప్పిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ‘‘కుప్పం పర్యటన నేపథ్యంలో రోడ్లు తవ్వి రెండంచెల బారికేడ్లు, బైండోవర్లు, గృహ నిర్బంధాలు, దుకాణాల మూసివేత, స్కూళ్లకు సెలవులు. జగన్‌లో అభద్రతా భావం, అనుమానం, అసహనం స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అచ్చెన్నాయుడు ట్వీట్‌లో తెలిపారు. ‘కుప్పం..అష్టదిగ్బంధం’ అని ఈనాడు పత్రికలో వచ్చిన కథనాన్ని ట్వీట్‌కు జత చేశారు.


సీఎం పర్యటన అంటేనే ప్రజలు భయపడుతున్నారు
- మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

గతంలో దొంగలు, బందిపోట్లను చూసి భయపడే ప్రజలు..నేడు సీఎం పర్యటన అంటే భయపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. ఎన్నడూ లేని విధంగా జగన్‌రెడ్డి పర్యటనలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని, పెద్ద ఎత్తున బారికేడ్లు పెతున్నారని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్‌రెడ్డి పర్యటించే ప్రాంతాల్లో బలవంతంగా దుకాణాలు, పాఠశాలలను మూసేయిస్తున్నారు. ఆర్టీసీ బస్సులను తీసుకొని ప్రభుత్వ ఖర్చులతో పార్టీ కార్యక్రమానికి జనాన్ని తరలిస్తున్నారు. సభ నుంచి జనాన్ని బయటకు వెళ్లనీయకుండా పోలీసులను కాపలాపెడుతున్నారు. జగన్‌ కుప్పం పర్యటనలో తెదేపా నాయకులపై బైండోవర్‌ కేసులు పెట్టారు. సీఎం పర్యటనకు రాకపోతే జరిమానా విధిస్తామని ప్రజలను బెదిరిస్తున్నారు. బీసీలపై ఆయనది కపట ప్రేమ. వైకాపాను ప్రజలు బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అని ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.


ఎన్టీఆర్‌ పేరు మార్పుతో ప్రజల్లో వ్యతిరేకత: రాయపాటి

తిరుమల, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడం తప్పని.. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. ఈ చర్యవల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. పేరు మార్పు నిర్ణయాన్ని సీఎం జగన్‌ వెనక్కి తీసుకోవాలని కోరారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని