దసరానాటికి వైకాపా పర్యవేక్షకుల జాబితా

వైకాపాలో నియోజకవర్గ పర్యవేక్షకుల నియామకం కొలిక్కి వచ్చింది. 175 నియోజకవర్గాలకు ఎంపిక చేసిన పర్యవేక్షకుల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.  వీరికి అప్పగించే

Published : 24 Sep 2022 05:52 IST

ఈనాడు, అమరావతి: వైకాపాలో నియోజకవర్గ పర్యవేక్షకుల నియామకం కొలిక్కి వచ్చింది. 175 నియోజకవర్గాలకు ఎంపిక చేసిన పర్యవేక్షకుల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.  వీరికి అప్పగించే బాధ్యతల విషయంలో కొంత స్పష్టత కోసం జాబితా విడుదలలో జాప్యమైనట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పర్యవేక్షకుల పేర్లతో కూడిన జాబితాను దసరాకు విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్యేలు ఉండగా అక్కడ మళ్లీ పార్టీ పర్యవేక్షకుల పేరుతో కొత్త వారిని తీసుకువస్తే పార్టీలో గ్రూపులు పెరిగిపోవడంతో పాటు ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతుందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే తాడికొండ నియోజకవర్గానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నా మరో ఎమ్మెల్సీని అక్కడ అదనపు సమన్వయకర్తగా నియమించడం వల్ల ఎదురైన అనుభవాలను ఆ వర్గాలు ఉదహరిస్తున్నాయి. ‘పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ కోసమే జిల్లా అధ్యక్షుడు, ప్రాంతీయ సమన్వయకర్త, రాష్ట్ర పర్యవేక్షకులు ఇప్పటికే ఉన్నారు. మరోవైపు నియోజకవర్గంలో పార్టీపరంగా ఏయే కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తున్నారనే విషయాలపై ఐప్యాక్‌ సంస్థకు చెందిన ప్రతినిధులు ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నారు. ఇప్పుడు మళ్లీ పర్యవేక్షకులు వచ్చి చేసేది ఏమి ఉంటుంది’ అని పార్టీ నేతలే ప్రైవేటు సంభాషణల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని