ప్రమాణం చేయడానికి సిద్ధమా?

వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని డబ్బులు అడగలేదని ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బ్రహ్మనాయుడి సవాల్‌పై ఆయన

Published : 24 Sep 2022 05:52 IST

ఎమ్మెల్యే బ్రహ్మనాయుడికి మాజీ మంత్రి ప్రత్తిపాటి ప్రతిసవాల్‌

ఈనాడు, అమరావతి: వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని డబ్బులు అడగలేదని ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బ్రహ్మనాయుడి సవాల్‌పై ఆయన మీడియాకు వీడియో సందేశం పంపారు. ‘వాస్తవంగా ఎవరైతే చెప్పారో వాళ్లు ప్రమాణం చేయాలి. అయినా సవాల్‌ స్వీకరిస్తున్నా...బ్రహ్మనాయుడి టెక్స్‌టైల్‌ పార్కు ఆగిపోవడానికి నాకు సంబంధం లేదని ప్రమాణం చేయడానికి కూడా సిద్ద్ధమే. రూ.40 కోట్ల సబ్సిడీ కాజేయాలని దురాలోచన చేశావు. రాష్ట్ర ప్రభుత్వానికి కట్టిన రూ.8 కోట్ల్లకు సంబంధించి ..స్థలం అమ్మి అప్పుడే సొమ్ము చేసుకున్నావు. ఎందుకు నీకు ఈ బాధ అని ప్రశ్నిస్తున్నా. మూడేళ్లు దాటినా టెక్స్‌టైల్‌ పార్కుని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నావు? ప్రభుత్వం మీదే ఉంది. అయినా టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణం చేయలేదు? నేను నీ సవాల్‌ స్వీకరిస్తున్నా... నువ్వు కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అదే విధంగా గుంటూరు టెక్స్‌టైల్‌ పార్కుకి సంబంధించి ఏపీఐఐసీ మేనేజర్‌ దగ్గరకు వచ్చానని చెబుతున్నావు. నేను రాలేదని ప్రమాణం చేస్తా..నిరూపించమని సవాల్‌ చేస్తున్నా...నేను వచ్చినట్లు అధికారులతో మాట్లాడించినా అభ్యంతరం లేదు. తిరుమల డెయిరీని చంద్రబాబు అనేక ఇబ్బందులకు గురి చేశారని అంటున్నావు..మీ డైరెక్టర్‌తో ప్రమాణం చేయిస్తావా? మీడియా సమావేశంలో రుజువు చేయగలవా?’ అని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts