తెదేపా నియోజకవర్గ బాధ్యులతో చంద్రబాబు సమీక్ష

తెదేపా అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముఖాముఖి సమావేశాలు కొనసాగుతున్నాయి. సమర్థంగా పని చేయని వారిని ప్రత్యామ్నాయం

Published : 24 Sep 2022 05:52 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముఖాముఖి సమావేశాలు కొనసాగుతున్నాయి. సమర్థంగా పని చేయని వారిని ప్రత్యామ్నాయం చూసుకోమంటారా? అని  సూటిగా ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం నగరం, పెద్దాపురం, రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో తన నివాసంలో చంద్రబాబు సమావేశమయ్యారు. అంతర్గత నివేదికల ఆధారంగా ఇన్‌ఛార్జుల పనితీరుపై మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, స్థానిక సమస్యలు, ప్రత్యర్థి పార్టీ విధానాలపై పోరాటం తదితర అంశాలను కూలంకషంగా చర్చించారు. నియోజకవర్గంలో అందర్నీ ఒక తాటిపైకి తేవాలని సూచించారు. గతంలో ఏ ప్రభుత్వంపైనా లేనంత వ్యతిరేకత జగన్‌ సర్కారుపై ఉందని నియోజకవర్గ బాధ్యులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో ఆయా నియోజకవర్గ బాధ్యులు నిమ్మకాయల చినరాజప్ప, ఆదిరెడ్డి భవాని, కొండ్రు మురళి పాల్గొన్నారు. ఇప్పటి వరకు 59 నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో పార్టీ అధినేత సమీక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని