అరెస్టులతో పాత్రికేయులను కట్టడి చేస్తారా?

‘‘పాత్రికేయులపై కేసులు పెట్టి అరెస్టులు చేసి కట్టడి చేయాలని వైకాపా ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. సీనియర్‌ పాత్రికేయులు కొల్లు అంకబాబును అరెస్టు చేయడంలో సుప్రీంకోర్టు

Published : 24 Sep 2022 05:52 IST

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: ‘‘పాత్రికేయులపై కేసులు పెట్టి అరెస్టులు చేసి కట్టడి చేయాలని వైకాపా ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. సీనియర్‌ పాత్రికేయులు కొల్లు అంకబాబును అరెస్టు చేయడంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించలేదు. అది ప్రభుత్వ నిరంకుశ ధోరణిని వెల్లడిస్తోంది. గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని పాత్రికేయుల వాట్సప్‌ గ్రూపులో పోస్టు చేశారంటూ అంకబాబును అరెస్టు చేసి కుట్రపూరిత నేరం కింద కేసులు నమోదు చేయడం చూస్తోంటే ప్రభుత్వం ఉలిక్కిపడుతున్నట్లు అనిపిస్తోంది’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సహచర జర్నలిస్టు అరెస్టును ఖండిస్తూ నిరసన తెలిపిన పాత్రికేయులపై కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు. ‘సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం చేస్తూ అభ్యంతరకర పోస్టులు పెట్టే అధికారపక్షం వారిపై సీఐడీ ఎందుకు స్పందించదు? ప్రతిపక్ష నేతలపై వైకాపా శ్రేణులు చేసే సైబర్‌ బుల్లీయింగ్‌, ట్రోలింగ్‌పై ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎందుకు పట్టించుకోరు’’ అని ప్రశ్నించారు. న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులనూ వైకాపా కార్యకర్తలు కించపరిస్తే అప్పుడు స్పందించని సీఐడీ.. సీనియర్‌ పాత్రికేయులు అంకబాబు షేర్‌ చేసిన సమాచారానికి ఎందుకు ఇంత తీవ్రంగా వ్యవహరిస్తోందని పవన్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని