ఊరికి ఉపకారం చేయనోళ్లు రాష్ట్రాన్ని బంగారం చేస్తారా?: రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత గ్రామంలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వెలుగు చూసిన ఘటనపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్‌లో స్పందించారు. సీఎం దత్తత తీసుకున్నారని మురిసిపోయిన గ్రామం.. నేడు అదే ముఖ్యమంత్రిపై

Updated : 25 Sep 2022 06:29 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత గ్రామంలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వెలుగు చూసిన ఘటనపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్‌లో స్పందించారు. సీఎం దత్తత తీసుకున్నారని మురిసిపోయిన గ్రామం.. నేడు అదే ముఖ్యమంత్రిపై విసిగిపోయి రోడ్డెక్కిందని విమర్శించారు. ఊరికి ఉపకారం చేయనోళ్లు రాష్ట్రాన్ని బంగారం చేస్తారా? అని ఎద్దేవా చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టిలు వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు.

ఆదివాసీ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా బెల్లయ్యనాయక్‌

ఈనాడు, దిల్లీ: అఖిలభారత ఆదివాసీ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన బెల్లయ్యనాయక్‌ తేజావత్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని