మునుగోడుకు మేనిఫెస్టో, ఛార్జిషీట్‌

మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, మంచి మెజార్టీతో విజయం సాధించాలని భాజపా స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించింది. తెరాస ప్రభుత్వ పాలనపై ఛార్జిషీట్‌ విడుదల చేయడంతో పాటు పార్టీ పరంగా మేనిఫెస్టోను ప్రకటించాలని

Updated : 25 Sep 2022 06:31 IST

భాజపా స్టీరింగ్‌ కమిటీ భేటీలో నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, మంచి మెజార్టీతో విజయం సాధించాలని భాజపా స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించింది. తెరాస ప్రభుత్వ పాలనపై ఛార్జిషీట్‌ విడుదల చేయడంతో పాటు పార్టీ పరంగా మేనిఫెస్టోను ప్రకటించాలని కమిటీ అభిప్రాయపడింది. ఛైర్మన్‌ జి.వివేక్‌ వెంకటస్వామి అధ్యక్షతన మునుగోడు స్టీరింగ్‌ కమిటీ తొలి సమావేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగింది. మండల ఇన్‌ఛార్జులు, సహ ఇన్‌ఛార్జులను వేయాలని సభ్యులు సూచించగా జాబితా రూపొందించారు. దీన్ని కరీంనగర్‌లో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌కి పంపించి ఆమోదం తీసుకున్నారు. మునుగోడులో భాజపా విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం వివేక్‌ జాబితాను ప్రకటించి విలేకరులతో మాట్లాడారు. సాధారణ ఎన్నికలకు మునుగోడు ఉపఎన్నిక ప్రీఫైనల్‌ లాంటిదని, ఇందులో భాజపా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిని చేసేందుకు ప్రయత్నం: వివేక్‌

మ్మెల్సీ కవితను హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షురాలిగా చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని, హెచ్‌సీఏ చరిత్రలో ఎన్నడూ లేని ఘటనలు జరగడానికి కల్వకుంట్ల కుటుంబమే కారణమని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, భాజపా జాతీయ కార్యవర్గసభ్యుడు జి.వివేక్‌ వెంకటస్వామి ధ్వజమెత్తారు. శనివారం ఆయన భాజపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల విక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని