గవర్నర్‌ గారూ! హద్దులు దాటొద్దు

పంజాబ్‌లో గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌, ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ నడుమ మాటలు మరోసారి వేడెక్కాయి. తమ ప్రభుత్వ బలాన్ని నిరూపించుకునేందుకు ఈనెల 22న శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని

Updated : 25 Sep 2022 06:22 IST

బన్వారీలాల్‌ పురోహిత్‌పై ఆప్‌ రుసరుసలు

చండీగఢ్‌: పంజాబ్‌లో గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌, ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ నడుమ మాటలు మరోసారి వేడెక్కాయి. తమ ప్రభుత్వ బలాన్ని నిరూపించుకునేందుకు ఈనెల 22న శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని ఆప్‌ సర్కారు కోరగా, గవర్నర్‌ తిరస్కరించారు. సరికదా, మాన్‌కు తన విధులను గుర్తుచేస్తూ తాజాగా లేఖ రాశారు. ‘‘మీ న్యాయ సలహాదారులు మీకు తగిన సమాచారం ఇవ్వడం లేదనుకుంటా. రాజ్యాంగంలోని 167, 168 ఆర్టికల్స్‌ను చదివితే నా గురించి మీ అభిప్రాయం మారవచ్చు. ఆర్టికల్‌ 167.. గవర్నర్‌ పట్ల సీఎం విధుల గురించి, ఆర్టికల్‌ 168 శాసనసభ కూర్పు గురించి వివరిస్తుంది. బహుశా నాపై మీకు తీవ్ర కోపం ఉండి ఉండొచ్చని పత్రికల్లో వచ్చిన మీ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. శాసనసభలో ఏయే అంశాలు చర్చిస్తారన్నది నాకు జాబితా సమర్పించండి’’ అని పురోహిత్‌ తన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు.

గవర్నర్‌ ఆమోదం లాంఛనప్రాయమే: ముఖ్యమంత్రి మాన్‌

‘‘శాసనసభను సమావేశపరచడానికి ముందు గవర్నర్‌ ఆమోదం పొందడం కేవలం లాంఛనప్రాయం మాత్రమే. అసెంబ్లీలో చర్చించే అంశాలపై గత 75 ఏళ్లలో ఏ గవర్నరూ ఇలా జాబితా అడగలేదు.శాసనసభ వ్యవహారాలను బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీతో కలిసి స్పీకర్‌ నిర్ణయిస్తారు. చూస్తుంటే... సభలో మాట్లాడదలచిన ఉపన్యాసాలను కూడా తనకు ముందే సమర్పించి, ఆమోదం పొందాలని గవర్నర్‌ అనేట్టున్నారు’’ అని ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts