అప్పుల ఊబిలో రాష్ట్రం: భీశెట్టి బాబ్జీ

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆందోళన వ్యక్తం చేశారు. రుణాలు తీర్చడానికి ప్రభుత్వానికి సరైన వ్యూహం లేకపోతే

Published : 25 Sep 2022 04:59 IST

విజయనగరం గంటస్తంభం, న్యూస్‌టుడే: రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆందోళన వ్యక్తం చేశారు. రుణాలు తీర్చడానికి ప్రభుత్వానికి సరైన వ్యూహం లేకపోతే జరిగే ప్రమాదాలను కాగ్‌ హెచ్చరించినా.. ఆ నివేదికపై కనీసం చర్చ జరగకపోవడం సరికాదన్నారు. శనివారం విజయనగరంలో ఆయన మాట్లాడారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితులపై కాగ్‌ ఇచ్చిన నివేదికను శాసనసభలో ఈ నెల 21న ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన.. అసలు చర్చ లేకుండా ఆరోపణలు, ప్రత్యారోపణలతో ముగించారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రుణాల భారాన్ని తట్టుకోలేని స్థితికి వచ్చిందని, ఇది మంచి పరిణామం కాదని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని