రైతులను రోడ్డుపై నిలబెట్టిన ఘనత వైకాపా ప్రభుత్వానిదే: సోము వీర్రాజు

రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోగా, రూ.2 వేల కోట్ల బకాయిలను చెల్లించకుండా పరోక్షంగా దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ వారిని రోడ్డుపై నిలబెట్టిన ఘనత వైకాపా

Published : 25 Sep 2022 05:22 IST

నెల్లూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే: రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోగా, రూ.2 వేల కోట్ల బకాయిలను చెల్లించకుండా పరోక్షంగా దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ వారిని రోడ్డుపై నిలబెట్టిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. శనివారం మూలాపేటలో జరిగిన స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. పోలవరం సహా పలు ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం రూ.14 వేల కోట్లు గ్రామీణ ప్రాంతాలకు కేటాయిస్తే వాటిని దారి మళ్లించారని ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జనసేనతో కలిసి భాజపా సర్కార్‌ ఏర్పాటు ఖాయమన్నారు. తీర ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం 60 శాతం నిధులు మంజూరు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని చెప్పారు. కేంద్రం సాగరమాల పేరుతో రోడ్డు వేయాలని ప్రయత్నించినా సహకరించకపోవడం బాధాకరమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని