MLA Umashankar: అండగా వస్తే.. అయ్యన్నను అక్కడే తొక్కేస్తా

ఉత్తరాంధ్రలో అలజడి సృష్టించడానికే అమరావతి ప్రాంత రైతులు అరసవల్లికి పాదయాత్రగా వస్తున్నారని, వారిని అడ్డుకుంటామని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల

Updated : 25 Sep 2022 07:36 IST

నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ వ్యాఖ్యలు

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రలో అలజడి సృష్టించడానికే అమరావతి ప్రాంత రైతులు అరసవల్లికి పాదయాత్రగా వస్తున్నారని, వారిని అడ్డుకుంటామని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ పునరుద్ఘాటించారు. వారికి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అండగా వస్తే.. అక్కడే తొక్కేస్తానని ఘాటుగా వ్యాఖ్యానించారు. నర్సీపట్నంలో శనివారం విడుదల చేసిన వీడియో ప్రకటనలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘అరసవల్లి సూర్యభగవానుడి దర్శనానికి వెళ్లాలంటే బస్సులోనో, కారులోనో, రైల్లోనో నేరుగా వెళ్లండి. తప్పు లేదు. పాదయాత్రగా ఎందుకు వస్తున్నారు? గొడవలు సృష్టించి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే సహించం. ఎన్టీఆర్‌ తెలుగు వారి గుండెల్లో ఉన్నది నిజమే. కానీ ఆయన గురించి మాట్లాడే హక్కు అయ్యన్నకు లేదు’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని