YS Sharmila: రేవంత్ జుట్టు కేసీఆర్ చేతుల్లో: షర్మిల
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారని, ఆయన జుట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లో ఉందని వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోసమే రింగ్‌రోడ్ డిజైన్ మార్పు అని ఆరోపణ
న్యూస్‌టుడే-సంగారెడ్డి మున్సిపాలిటీ, కొండాపూర్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారని, ఆయన జుట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లో ఉందని వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం సంగారెడ్డి, కొండాపూర్ మండలం మల్కాపూర్, తొగర్పల్లి గ్రామాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆమె మాట్లాడారు.
రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్ మాట వింటారని.. సోనియా మాట వినరని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో ఉన్న నాయకుడు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. తాను భాజపా వదిలిన బాణమని పీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు జగ్గారెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని, తాను వైఎస్ఆర్ వదిలిన బాణమని చెప్పారు. రూ.300 బతుకమ్మ చీర ఇచ్చి పండగ చేసుకోమంటే ఎలా అని ప్రశ్నించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భూముల కోసమే రీజినల్ రింగ్‌రోడ్ డిజైన్ మార్పు చేశారని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఉద్యోగాల భర్తీపైనే చేస్తామని ప్రకటించారు. ఆడపిల్లలపై అత్యాచారాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు