ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: తెజస

తెలంగాణ కోసం అశువులుబాసిన, పోరాడిన కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ జన సమితి (తెజస)

Published : 26 Sep 2022 04:11 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలంగాణ కోసం అశువులుబాసిన, పోరాడిన కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ జన సమితి (తెజస) అధ్యక్షుడు ప్రొ.కోదండరాం డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సాధనలో అమరులైన వారికి మహాలయ అమావాస్యను పురస్కరించుకొని పితృపక్ష సంప్రదాయం ప్రకారం బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఆదివారం గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద తెజస ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం కోదండరాం మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్‌ ప్రభుత్వం ఆత్మగౌరవం లేకుండా చేసింది. ఉద్యమంలో వ్యతిరేకంగా పని చేసినవాళ్లే ప్రభుత్వంలో ఉన్నారు. రాష్ట్ర సాధనలో అమరులైన వారిలో కొందరికే సహాయం అందింది. ముఖ్యంగా ఉద్యమంలో 650 మంది ఆత్మహత్యలు చేసుకుంటే, మరో 600 మంది మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించారు. ఇలాంటి వారితో పాటు ఆత్మహత్యాయత్నంలో బతికి బయటపడిన వారికీ సహాయం అందించాల్సిన అవసరం ఉంది’’ అని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని