క్రికెట్‌ ఆడకపోయినా జైషాకు బీసీసీఐ పదవి

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుమారుడు జైషా క్రికెట్‌ ఆడకపోయినా బీసీసీఐ కార్యదర్శిగా నియమితులయ్యారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. ఇలా

Published : 26 Sep 2022 04:11 IST

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుమారుడు జైషా క్రికెట్‌ ఆడకపోయినా బీసీసీఐ కార్యదర్శిగా నియమితులయ్యారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. ఇలా వచ్చిన వారు ప్రతిభావంతులను పక్కకు నెట్టి ఆ సంస్థలోని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాజ్యాధికార యాత్ర రెండో విడతలో భాగంగా ఆదివారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌, లక్కారం, తంగడపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, అంబేడ్కర్‌ విగ్రహాలకు నివాళి అర్పించారు. అనంతరం ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ గుజరాత్‌ వ్యాపారులకు దేశాన్ని కట్టబెడుతున్నారని, నిత్యావసర సరకుల ధరలు పెంచి పేదల సొమ్ము దోచుకుంటున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పథకాల ద్వారా కమీషన్ల రూపంలో రూ.వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. తెలంగాణ మహిళలకు నాసిరకం చీరలు పంపిణీ చేసి వారిని అవమానిస్తున్నారన్నారు. బహుజన రాజ్యం సిద్ధించాక కేసీఆర్‌ అక్రమ ఆస్తులను ప్రజలకు పంచిపెడతామని చెప్పారు. అర్హతగల ప్రతి కుటుంబానికి ఎకరం భూమి ఇస్తామని, పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని