అది దోపిడీదారుల సర్వసభ్య సమావేశం

ఉత్తరాంధ్రలో మూడున్నరేళ్లుగా దోచుకున్న దాంట్లో వాటాలు పంచుకునేందుకే వైకాపా నేతలు విశాఖపట్నంలో సమావేశమయ్యారని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు విమర్శించారు. ‘విశాఖపట్నంలో జరిగింది

Published : 26 Sep 2022 04:49 IST

తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు

ఈనాడు-అమరావతి: ఉత్తరాంధ్రలో మూడున్నరేళ్లుగా దోచుకున్న దాంట్లో వాటాలు పంచుకునేందుకే వైకాపా నేతలు విశాఖపట్నంలో సమావేశమయ్యారని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు విమర్శించారు. ‘విశాఖపట్నంలో జరిగింది రౌండ్‌టేబుల్‌ సమావేశం కాదు... దోపిడీదారుల సర్వసభ్య సమావేశం’ అని ఎద్దేవా చేశారు. ‘రాష్ట్ర ప్రజలు, అన్ని పార్టీలు, వైకాపా నేతలు అమరావతినే రాజధానిగా కావాలంటున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తన పదవి పోతుందనే భయంతో వణికిపోతున్నారు. జగన్‌రెడ్డికి భయపడి కొందరు వైకాపా నేతలు మూడు రాజధానులకు మద్దతిస్తున్నారు. తమ స్వార్థం కోసం ప్రజల మధ్య ప్రాంతీయ చిచ్చు పెట్టాలన్న జగన్‌రెడ్డి కుట్రలో భాగస్వాములైన నేతలు చరిత్రలో ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారు’ అని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని