మన్‌ కీ బాత్‌లో మోదీ ఎన్నడూ రాజకీయాలు మాట్లాడలేదు: నడ్డా

భాజపా శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ఆదేశాలు జారీ చేశారు. అందరూ కలిసి ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమం విన్న తర్వాతే బూత్‌ స్థాయి సమావేశాలు నిర్వహించాలని

Published : 26 Sep 2022 04:49 IST

కొచి: భాజపా శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ఆదేశాలు జారీ చేశారు. అందరూ కలిసి ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమం విన్న తర్వాతే బూత్‌ స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గత కొన్నేళ్లుగా ప్రధాని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని వింటోన్న వారి సంఖ్య ప్రతి నెలా పెరుగుతోందన్నారు. అందరూ కలిసికట్టుగా ‘మన్‌ కీ బాత్‌’ ఆలకించేలా పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు మండల, తాలూకా, ప్రాంతీయ, బూత్‌ స్థాయి అధ్యక్షులు కృషి చేయాలని సూచించారు.  రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళ వచ్చిన నడ్డా.. అలువా సమీపంలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి జావడేకర్‌, పలువురు నేతలతో కలిసి ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమాన్ని ఆలకించారు. అనంతరం నడ్డా మాట్లాడుతూ.. 2014 నుంచి ఇప్పటి వరకు 93 మన్‌ కీ బాత్‌ ఎపిసోడ్‌లు జరిగాయన్నారు. అయితే, ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఎన్నడూ రాజకీయ అంశాలు మాట్లాడలేదని గుర్తు చేశారు. సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ, స్వచ్ఛత తదితర అంశాలతో పాటు స్ఫూర్తినిచ్చే వ్యక్తులు, క్రీడల గురించే చెప్పారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని