ఎయిమ్స్‌కు నీళ్లివ్వని ప్రభుత్వాన్ని ఏమనాలి?

‘రాష్ట్రంలో వైద్య కళాశాలలను తామే తెచ్చామని అసెంబ్లీలో అసత్యాలు చెప్పిన సీఎం... మంగళగిరి ఎయిమ్స్‌కు తానుంటున్న మున్సిపాలిటీ నుంచి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారు?....

Updated : 27 Sep 2022 04:54 IST

తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్‌

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో వైద్య కళాశాలలను తామే తెచ్చామని అసెంబ్లీలో అసత్యాలు చెప్పిన సీఎం... మంగళగిరి ఎయిమ్స్‌కు తానుంటున్న మున్సిపాలిటీ నుంచి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారు? రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వైద్య సంస్థకు కనీసం నీటిని సరఫరా చేయలేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? వైకాపా ప్రభుత్వం ఎయిమ్స్‌ కోసం మూడేళ్లలో ఏం చేసిందో చెప్పగలదా? తెదేపా హయాంలో భూములిచ్చి, వసతులు కల్పించాం. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేలా సిద్ధం చేశాం. ప్రస్తుతం సంస్థకు పెరిగిన అవసరాలకు అదనంగా నీటి వనరులను సమకూర్చాలని కేంద్రమే లేఖలు రాసినా పరిష్కరించకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. కేంద్ర మంత్రులు సైతం నీటి వసతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా స్పందించని సీఎం... వైద్య రంగంలో సమూల మార్పులు తన వల్లేనని గొప్పలకు పోతున్నారు. మీ చేతగాని తనం లక్షలాది మంది ప్రజలకు శాపంగా మారకూడదు’ అని తెదేపా అధినేత చంద్రబాబు సోమవారం ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని