పాదయాత్రను ఎలా అడ్డుకుంటామో మీకు చెప్పి చేస్తామా?: మంత్రి బొత్స

‘విశాఖపట్నంలో రాజధాని పెట్టొద్దని ఆ ప్రాంతానికి వచ్చి అంటే అక్కడి వారు ఎందుకు ఊరుకుంటారు? అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Updated : 27 Sep 2022 04:51 IST

ఈనాడు, అమరావతి: ‘విశాఖపట్నంలో రాజధాని పెట్టొద్దని ఆ ప్రాంతానికి వచ్చి అంటే అక్కడి వారు ఎందుకు ఊరుకుంటారు? అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స స్పందిస్తూ... ‘అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవడం అయిదు నిమిషాల పని అని నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. ఎలా అడ్డుకుంటామని మీకు చెప్పి చేస్తామా’ అని వ్యాఖ్యానించారు. ‘జరుగుతున్నది అమరావతి రైతుల యాత్ర కాదు. రియల్‌ ఎస్టేట్‌ యాత్ర. ఈ ముసుగులో జరుగుతున్న తెదేపా యాత్ర. రెండు మూడు ఛానళ్లు నాపై వ్యతిరేక ప్రచారం చేస్తే నేను బెదరను. పోలవరం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులది త్యాగం. రాజధాని అమరావతికి ల్యాండ్‌ఫూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులది త్యాగం ఎలా అవుతుంది. 2004లో విశాఖపట్నంలో ల్యాండ్‌పూలింగ్‌ చేశారు. రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేస్తామంటున్నాం. భూములు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారికి ఏం ఇబ్బంది వచ్చింది. ప్రభుత్వం అరిటాకులాంటిది. ప్రతిపక్షం ముల్లులాంటిది. ఏదైనా ప్రభుత్వానికే నష్టం. అమరావతి కోసం ఐదేళ్లల్లో రూ.ఐదు లక్షల కోట్లు మట్టిలో పోయాల్సి వస్తుంది’ అని మంత్రి బొత్స వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు