వైఎస్సార్‌ని నిందితుడిగా చేసింది ఆయన కుమారుడు జగన్‌రెడ్డే

ముఖ్యమంత్రి జగన్‌ తన అవినీతి కేసుల్లో తండ్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డినే నిందితుడిగా చేశారని, అసలైన వెన్నుపోటు అంటే అదేనని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు.

Updated : 27 Sep 2022 05:49 IST

అసలు వెన్నుపోటు అంటే ఇదే
ట్విటర్‌లో నారా లోకేష్‌ ఎద్దేవా

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ తన అవినీతి కేసుల్లో తండ్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డినే నిందితుడిగా చేశారని, అసలైన వెన్నుపోటు అంటే అదేనని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు. ‘‘పేటీఎం బ్యాచ్‌. దిస్‌ ఈజ్‌ రియల్‌ వెన్నుపోటు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి మరీ అవినీతి కేసుల్లో వైఎస్సార్‌ని నిందితుడిని చేసింది ఆయన కుమారుడు జగన్‌రెడ్డే. మీలా ఆధారాల్లేని ఆరోపణలు చేయడం లేదు. పక్కా ఆధారాలతో బయటపెడుతున్నా’ అని లోకేష్‌ సోమవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ అంశంపై మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను లోకేష్‌ తన ట్వీట్‌కి జత చేశారు. ఆ వీడియో క్లిప్పింగ్‌లో యాంకర్‌ అడిగిన ప్రశ్నకు అరుణ్‌కుమార్‌ బదులిస్తూ... ‘రాజశేఖర్‌రెడ్డిని ఎవరు చేశారు నిందితుడిగా? జగన్మోహన్‌రెడ్డే చేశాడు. చెప్పండి ఎవరు చేశారు నిందితుడిగా? ఎఫ్‌ఐఆర్‌లో పేరు పెట్టారన్న దానిపై అంత బాధ వచ్చినవాళ్లు... ఇక్కడ కోర్టు అంగీకరించకపోతే, సుప్రీంకోర్టు స్థాయి నుంచి తెచ్చారు. రాజశేఖర్‌రెడ్డిని ప్రథమ నిందితుడిని చేయండి, ఆయన మంత్రివర్గమంతా కలిసే చేశారు. నాకేంటి సంబంధమని కోర్టుకి చెప్పారు’ అని ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని