జమ్మూకశ్మీర్‌లో ఆజాద్‌ కొత్త పార్టీ

కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుబంధాన్ని గత నెలలో తెంచుకున్న సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటుచేశారు. ‘డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ (డీఏపీ)’గా దానికి నామకరణం చేశారు. సోమవారం

Published : 27 Sep 2022 04:57 IST

  డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీగా నామకరణం

జమ్మూ: కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుబంధాన్ని గత నెలలో తెంచుకున్న సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటుచేశారు. ‘డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ (డీఏపీ)’గా దానికి నామకరణం చేశారు. సోమవారం ఇక్కడ ఆజాద్‌ విలేకరుల సమావేశం నిర్వహించి.. పార్టీకి సంబంధించిన వివరాలు, లక్ష్యాలను వెల్లడించారు. ప్రజాస్వామ్యం, భావప్రకటన స్వేచ్ఛ, సమష్టి ఆలోచనలకు ప్రతీకగా తమ పార్టీ నిలుస్తుందన్నారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలతో ముందుకెళ్తుందని వివరించారు. జమ్మూ-కశ్మీర్‌లో సాధారణ వాతావరణాన్ని, శాంతియుత పరిస్థితులను నెలకొల్పడంపై దృష్టిపెడతామన్న ఆజాద్‌.. ఆర్టికల్‌ 370 పునరుద్ధరణను ఎన్నికల అంశంగా వాడుకోదలచుకోలేదని స్పష్టం చేశారు. ఆ అధికరణంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను కశ్మీర్‌లోని పార్టీలు విమర్శించడంపై స్పందిస్తూ.. ‘‘ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ సాధ్యం కాదని నేనెప్పుడూ చెప్పలేదు. ఈ విషయంలో ప్రధాని మోదీని నేను ఒప్పంచలేనని మాత్రమే చెప్పా’’ అని పేర్కొన్నారు. నీలం, తెలుపు, పసుపు రంగులు నిలువునా ఉన్న జెండాను డీఏపీ పతాకంగా ఆజాద్‌ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని