ఆత్మీయ సమ్మేళనాల పేరుతో మోసం: ప్రవీణ్‌కుమార్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని తెరాస ప్రభుత్వం ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి, మద్యం పంచి పేదలను మోసం చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. బహుజన రాజ్యంలో తెలంగాణ

Published : 27 Sep 2022 04:57 IST

సంస్థాన్‌ నారాయణపురం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని తెరాస ప్రభుత్వం ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి, మద్యం పంచి పేదలను మోసం చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. బహుజన రాజ్యంలో తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్య, ఉద్యోగాలిస్తామని చెప్పారు. రాజ్యాధికార యాత్ర రెండో విడతలో భాగంగా సోమవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలో పర్యటించారు. గుజ్జ గ్రామంలో మహిళలతో ఆర్‌ఎస్పీ అలాయ్‌ బలాయ్‌ కార్యక్రమం నిర్వహించారు. తెరాస ఆధ్వర్యంలో గ్రామంలో దళిత కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం పేరుతో దావతులు, చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నా మీరంతా ఈ సమావేశానికి హాజరుకావడం సంతోషకరమని ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. వారు పెట్టే ఖర్చంతా మీ సొమ్మేనని.. వారి ఆస్తులు అమ్మి ఇవ్వడం లేదని చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో దొరల పాలన అంతం చేస్తామన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని