సీఎం చెప్పినవన్నీ అబద్ధాలే

‘ఎన్టీఆర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం పేరును ప్రభుత్వం మార్చింది. వర్సిటీ పేరు మార్చాలన్న నిర్ణయంపై అసెంబ్లీలో జరిగిన....

Published : 27 Sep 2022 04:57 IST

తెదేపా నేత నక్కా ఆనందబాబు

ఈనాడు, అమరావతి: ‘ఎన్టీఆర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం పేరును ప్రభుత్వం మార్చింది. వర్సిటీ పేరు మార్చాలన్న నిర్ణయంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం చెప్పినవన్నీ అబద్ధాలే. ఉమ్మడి రాష్ట్రంలో 24 వైద్య కళాశాలలను తెచ్చిన ఘనత చంద్రబాబుది. ప్రభుత్వం చెప్పిన 17 వైద్య కళాశాలలు పునాదుల దశలోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్ని వైద్య కళాశాలలు ఉన్నాయనే దానిపైనా సీఎంకు అవగాహన లేదు. ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై లక్ష్మీపార్వతి స్పందించిన తీరును ప్రజలూ విమర్శిస్తున్నారు’ అని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

* ‘ఎన్టీఆర్‌ను కించపరచేలా దాడిశెట్టి రాజా మాట్లాడితే సహించేది లేదు. అసలు ఎన్టీఆర్‌కు... వైఎస్‌కు పోలిక ఏంటి? జగన్‌ మంత్రివర్గంలో చరిత్ర తెలియని మంత్రులు ఉన్నారు. దాడిశెట్టి రాజా మాటలను సీఎం సమర్థిస్తారా’ అని మాజీ మంత్రి జవహర్‌ ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts