బొప్పాయి కొట్టులోనూ పేటీఎం ఉంటోంది.. బ్రాందీ షాపులో ఉండట్లేదు: సోము వీర్రాజు

‘బ్రాందీ షాపు వద్ద బొప్పాయి కొట్టులో పేటీఎం ఉంటుంది. కానీ బ్రాందీ షాపులో పేటీఎం ఉండదు. సగం డబ్బు ఇంటికి, సగం ప్రభుత్వానికి వెళ్తుంది. ప్రజల వద్ద నుంచి నెలకు రూ.10వేల

Updated : 28 Sep 2022 09:27 IST

ఈనాడు, అమరావతి: ‘బ్రాందీ షాపు వద్ద బొప్పాయి కొట్టులో పేటీఎం ఉంటుంది. కానీ బ్రాందీ షాపులో పేటీఎం ఉండదు. సగం డబ్బు ఇంటికి, సగం ప్రభుత్వానికి వెళ్తుంది. ప్రజల వద్ద నుంచి నెలకు రూ.10వేల చొప్పున రూ.1.2 లక్షలు తీసుకుంటున్నారు. ఆ డబ్బునే బటన్‌ నొక్కి వెనక్కి ఇస్తున్నారు....’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ధ్వజమెత్తారు. గుంటూరు, మంగళగిరిలో మంగళవారం భాజపా చేపట్టిన ప్రజాపోరు యాత్రలో ఆయన మాట్లాడారు. ఇసుక, మద్యం, బియ్యం ఇలా అనేక రకాలుగా దోపిడీ చేస్తూ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తున్నారన్నారు. రాజధాని అమరావతి సాధనకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని