ఒళ్లు బలిసిన వారి పాదయాత్ర: మంత్రి అంబటి

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఒళ్లు బలిసిన వారు చేస్తున్న పాదయాత్ర అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా

Published : 28 Sep 2022 05:37 IST

కోడూరు (అవనిగడ్డ), న్యూస్‌టుడే: అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఒళ్లు బలిసిన వారు చేస్తున్న పాదయాత్ర అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా కోడూరులో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్‌ చేయూత మూడో విడత పంపిణీలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికే సీఎం జగన్‌ మూడు రాజధానులను కొనసాగించాలని చూస్తున్నారన్నారు. కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని, తన పార్టీపై నమ్మకం లేక మిగిలిన పార్టీలతో కలిసి వెళ్లేందుకు ఆయన చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తెదేపాను కాపాడేందుకే జనసేన పార్టీని పెట్టారని, అలాంటి వారికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేష్‌, బాలకృష్ణ ఇలా... ఎంత మంది కలిసి పోటీ చేసినా ఈసారీ జగన్‌మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రి అవడం ఖాయమని అంబటి జోస్యం చెప్పారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని