హిందూ సంప్రదాయాలను గౌరవించరా?

‘తిరుమలలో ఉన్న ఆచార, సంప్రదాయాలను సీఎం జగన్‌ పాటించడం లేదు. బ్రహ్మోత్సవాలకు భార్యా సమేతంగా హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించాలి. జెరూసలేంకు

Published : 28 Sep 2022 04:26 IST

తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్‌

ఈనాడు, అమరావతి: ‘తిరుమలలో ఉన్న ఆచార, సంప్రదాయాలను సీఎం జగన్‌ పాటించడం లేదు. బ్రహ్మోత్సవాలకు భార్యా సమేతంగా హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించాలి. జెరూసలేంకు భార్యతో కలిసి వెళ్లిన ఆయన తిరుపతికి ఎందుకు అలా రాలేదు? హిందూ సంప్రదాయాలను అతిక్రమించి ప్రజల మనోభావాలను దెబ్బతీశార’ని తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు. ‘తిరుమలలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులంతా సతీసమేతంగా వెళ్లేవారు. జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఒంటరిగా వెళ్తూ హిందూ సంప్రదాయాలను మంటగలుపుతున్నారు’ అని తెదేపా ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి జూమ్‌ కాన్ఫరెన్స్‌లో ధ్వజమెత్తారు.

డిక్లరేషన్‌పై సీఎం సంతకం పెట్టాలి: భాజపా
హిందూ మతం, సంప్రదాయాలపై నమ్మకం ఉన్నట్లు తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్‌పై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంతకం చేయాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్‌నాయుడు డిమాండ్‌ చేశారు. లేదంటే సీఎంకు హిందూ సంప్రదాయాలపై నమ్మకం లేనట్లుగా భావించాల్సి వస్తుందని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన స్పష్టంచేశారు. ‘తితిదే అధికారులు కూడా సంప్రదాయాలను పాటించాలి. అబ్దుల్‌ కలాం, సోనియాగాంధీలతోపాటు చాలామంది అన్యమతస్థులతో డిక్లరేషన్‌పై సంతకం చేయించినప్పుడు సీఎం జగన్‌తో ఎందుకు చేయించరు?’ అని ఆయన ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని