గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెద్దకుట్ర: షర్మిల

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనడం పెద్దకుట్ర అని, ఉద్యోగ ప్రకటన ఇచ్చిన తరవాత కోర్టుకు వెళ్లి ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాటకం ఆడుతోందని వైతెపా అధ్యక్షురాలు

Published : 28 Sep 2022 04:38 IST

న్యూస్‌టుడే, జిన్నారం: గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనడం పెద్దకుట్ర అని, ఉద్యోగ ప్రకటన ఇచ్చిన తరవాత కోర్టుకు వెళ్లి ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాటకం ఆడుతోందని వైతెపా అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె మంగళవారం సంగారెడ్డి జిల్లా  జిన్నారంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించాలంటూ మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న బాసర ఐఐటీ విద్యార్థులు మంత్రి కేటీఆర్‌కు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనను భయపెట్టాలని చూస్తున్నారని, అది ఆయనకు సాధ్యం కాదని షర్మిల పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని