ఇష్టం లేకున్నా చీరలు ఇస్తున్నారు: బీఎస్పీ

మహిళలకు ఇష్టం లేకపోయినా తెరాస పాలకులు బలవంతంగా బతుకమ్మ చీరలు ఇస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. వాటిని తీసుకోకుంటే ప్రభుత్వ పథకాలు రావంటూ బెదిరింపులకు

Published : 28 Sep 2022 05:31 IST

సంస్థాన్‌నారాయణపురం, న్యూస్‌టుడే: మహిళలకు ఇష్టం లేకపోయినా తెరాస పాలకులు బలవంతంగా బతుకమ్మ చీరలు ఇస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. వాటిని తీసుకోకుంటే ప్రభుత్వ పథకాలు రావంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆయన మంగళవారం యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలో పర్యటించారు. పుట్టపాకలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి, అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని