నామినేషన్‌ పత్రాలు తీసుకున్న పీకే బన్సల్‌

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయడంపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఏఐసీసీ కోశాధికారి పవన్‌ కుమార్‌ బన్సల్‌ నామినేషన్‌

Published : 28 Sep 2022 04:38 IST

దిల్లీ: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయడంపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఏఐసీసీ కోశాధికారి పవన్‌ కుమార్‌ బన్సల్‌ నామినేషన్‌ పత్రాలు తీసుకోవడం చర్చనీయాంశమయ్యింది. అయితే, పార్టీ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని బన్సల్‌ ఆ తర్వాత వెల్లడించారు. అశోక్‌ గహ్లోత్‌ నామినేషన్‌ దాఖలు చేస్తారో లేదో తనకు తెలియదని కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ మంగళవారం దిల్లీలో విలేకరులతో అన్నారు. శశిథరూర్‌ మాత్రం ఈ నెల 30న ఉదయం 11 గంటలకు నామినేషన్‌ సమర్పించనున్నట్లు తన కార్యాలయానికి సమాచారం అందించారని తెలిపారు. సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసి అధ్యక్ష ఎన్నికల కోసం రూపొందించిన గుర్తింపు కార్డును అందజేసినట్లు మిస్త్రీ చెప్పారు. పవన్‌ కుమార్‌ బన్సల్‌ మరెవరి కోసమైనా నామినేషన్‌ పత్రాలను తీసుకుని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని