బొత్సకు పాదయాత్రను ఆపే దమ్ముందా?: సీపీఐ

‘అమరావతి రైతుల పాదయాత్రను ఆపే దమ్ము మంత్రి బొత్స సత్యనారాయణకు ఉందా? పాదయాత్రకు జగన్‌ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది తలపెట్టినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి

Updated : 28 Sep 2022 05:57 IST

ఈనాడు, అమరావతి: ‘అమరావతి రైతుల పాదయాత్రను ఆపే దమ్ము మంత్రి బొత్స సత్యనారాయణకు ఉందా? పాదయాత్రకు జగన్‌ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది తలపెట్టినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. ‘అమరావతి రైతులను రెచ్చగొట్టేలా మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులు రోడ్డెక్కడానికి ప్రధాన కారణం సీఎం జగన్‌ మాట తప్పడమే. గతంలోనూ అమరావతి ఉద్యమానికి పోటీగా వైకాపా దీక్షలు పెట్టించింది. కూలీలను తీసుకొచ్చి వారికి డబ్బులిచ్చి, దీక్షల్లో కూర్చోబెట్టారు. అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంటే ఓర్వలేక వైకాపా మంత్రులు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. పలుచోట్ల పోలీసులను ప్రయోగించి, పాదయాత్రను ఆపాలనే కుట్రలు చేస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి గంగవరం పోర్టును అదానీ కంపెనీకి ప్రభుత్వం అప్పనంగా అప్పగించింది. అదానీకి ఊడిగం చేస్తున్న పాలకులు తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విశాఖను ముంబయిలా చేస్తామని చెబుతున్నారు. మూడు రాజధానులనేది ప్రజలను మధ్యపెట్టేందుకు జగన్‌ ప్రభుత్వం చేస్తున్న కుట్ర మాత్రమే’ అని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని